టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతూ ఉండటం సాధారణం అయింది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు అనుష్క శెట్టి నటించిన ఘాటి కూడా చేరింది. మొదట ఏప్రిల్‌లో థియేటర్స్‌కి రావాల్సిన ఈ మూవీ ఒక్కసారి కాదు, వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5కి మార్చారని చెబుతున్నారు.
అయితే అదే రోజున మరికొన్ని క్రేజీ సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్ కూడా సెప్టెంబర్ 5నే థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నాడన్న విషయం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచింది. ఇక గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో రష్మిక మందన్న మంచి సక్సెస్ సాధించాలని చూస్తోంది. ఈ మూవీ కూడా అదే డేట్ కోసం ప్లాన్ అవుతోంది.
ఇంతటితో ఆగకుండా తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన మదరాసీ అనే డబ్బింగ్ మూవీ కూడా అదే రోజున బాక్సాఫీస్‌లోకి రావడానికి సన్నద్ధమవుతోంది. అంటే సెప్టెంబర్ 5న ఒకేసారి నాలుగు సినిమాలు థియేటర్స్‌లో అడుగుపెట్టబోతున్నాయి. ఇందులో ఏ సినిమా గెలుస్తుందో, బాక్సాఫీస్‌లో ఏది టాప్‌లో నిలుస్తుందో చూడాలి.